Prabhu deva: డైరెక్షన్‌కి గుడ్‌బై చెప్పబోతున్నాడా..?
ABN, First Publish Date - 2021-09-22T15:28:12+05:30
కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్‌గా ప్రభుదేవాకి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన అప్పుడప్పు స్పెషల్ సాంగ్స్‌లో మెరిశాడు.
కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్‌గా ప్రభుదేవాకి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన అప్పుడప్పు స్పెషల్ సాంగ్స్‌లో మెరిశాడు. ఆ తర్వాత హీరోగా మారి పలు సూపర్ హిట్స్ అందుకున్నాడు. డాన్స్‌లో ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా దర్శకుడిగా మారి తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'పౌర్ణమి' వంటి చిత్రాలను తెరకెక్కించాడు. ఆ తర్వాత బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌తో తెలుగు పోకిరి సినిమా రీమేక్ 'వాంటెడ్', ఇటీవల వచ్చిన 'రాధే' సహా పలు హిందీ చిత్రాలకి దర్శకత్వం వహించాడు. సౌత్ అలాగే నార్త్ ఇండస్ట్రీలలో కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌గా మంచి క్రేజ్ ఉన్నప్పటికి, ఇకపై డైరెక్షన్‌కి దూరంగా ఉండాలనుకుంటున్నాడట. దర్శకుడిగా అవకాశాలు వస్తున్నప్పటికీ నటుడిగా, కొరియోగ్రాఫర్‌గానే కొనసాగాలనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో వాస్తవమెంత ఉందనేది తెలియాలంటే ఆయనే స్పందించాలి.