సూపర్ కాప్‌గా ప్రభాస్.. దర్శకుడెవరంటే..!

ABN , First Publish Date - 2021-08-29T14:36:28+05:30 IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సూపర్ కాప్‌గా నటించబోతున్నాడంటూ నెట్టింట వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. 'రన్ రాజా రన్' వంటి చిన్న సినిమాతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్‌లో

సూపర్ కాప్‌గా ప్రభాస్.. దర్శకుడెవరంటే..!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సూపర్ కాప్‌గా నటించబోతున్నాడంటూ నెట్టింట వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. 'రన్ రాజా రన్' వంటి చిన్న సినిమాతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్‌లో టాలెంట్ గుర్తించిన ప్రభాస్, ఆయనతో 'సాహో' సినిమా చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఇందులో ప్రభాస్‌ను హాలీవుడ్ హీరోలా చూపించాడు. 'సాహో' తర్వాత సుజీత్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయ్యాడు. దీని తర్వాత 'లూసీఫర్' తెలుగు రీమేక్ చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోయింది. దాంతో ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమాను ఏ హీరోతో చేయబోతున్నాడో క్లారిటీ లేకపోయింది. 


అయితే, తాజాగా ఓ సూపర్ కాప్ స్టోరీ లైన్‌ని ప్రభాస్‌కి వినిపించాడట సుజీత్. ఆ లైన్ బాగా నచ్చడంతో పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్దం చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'రాధే శ్యామ్', 'సలార్', 'ఆదిపురుష్' చిత్రాలతో పాటు వైజయంతీ మూవీస్‌లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్ ఫిక్షన్ 'ప్రాజెక్ట్ k' మూవీని చేస్తున్నారు ప్రభాస్. వీటి తర్వాతే ప్రభాస్ - సుజీత్‌ల ప్రాజెక్ట్ ఉండే అవకాశాలున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది. 

Updated Date - 2021-08-29T14:36:28+05:30 IST