సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రవితేజతో 'పెళ్లి సందD' హీరోయిన్..?

ABN, First Publish Date - 2021-09-24T13:10:58+05:30

'క్రాక్' వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ వరుసగా ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'క్రాక్' వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ వరుసగా ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీలో రవితేజకి జంటగా కన్నడ కుర్ర హీరోయిన్ శ్రీ లీలని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈమె ప్రస్తుతం డెబ్యూ లేడీ డైరెక్టర్ గౌరీ రోణంకి దర్శకత్వంలో రూపొందుతున్న 'పెళ్లి సందD' చిత్రంలో శ్రీకాంత్ కొడుకు రోషన్‌కి జంటగా నటిస్తుంది. ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేసిన ట్రైలర్‌లో శ్రీ లీల బాగానే ఆకట్టుకుంది. దాంతో ఆమెకి రవితేజ మూవీలో ఆఫర్ దక్కినట్టు చెప్పుకుంటున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ రానుందట. కాగా ప్రస్తుతం రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి', నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు' చిత్రాలు చేస్తున్నాడు.   

Updated Date - 2021-09-24T13:10:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!