సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పవన్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమా అదేనా?

ABN, First Publish Date - 2021-01-28T14:58:38+05:30

ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్‌పై దృష్టి సారిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్‌పై దృష్టి సారిస్తున్నారు. అయితే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలో నటించలేదు. త్వరలో ఆ లోటు కూడా తీరబోతోంది. పవన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అదే డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న సినిమా. 


మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ వేస్తున్నారు. అలాగే రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా షూటింగ్ జరుపబోతున్నారు. ఇక, గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత ఏఎమ్ రత్నం ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌నే కేటాయించారట. ఏకంగా 170 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. 

Updated Date - 2021-01-28T14:58:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!