పవన్ కళ్యాణ్ ఆ మాస్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..?

ABN , First Publish Date - 2021-12-30T13:36:34+05:30 IST

కొన్ని రేర్ కాంబినేషన్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. అలాంటి రేర్ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీరి కాంబినేషన్‌లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతునట్టు

పవన్ కళ్యాణ్ ఆ మాస్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..?

కొన్ని రేర్ కాంబినేషన్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. అలాంటి రేర్ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీరి కాంబినేషన్‌లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతునట్టు తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల 'అఖండ' సినిమాతో బాలయ్యకి హ్యాట్రిక్ ఇచ్చిన బోయపాటి అఫీషియల్‌గా ఇంకా నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆయన నెక్స్ట్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ లోపు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నారనే తాజా వార్త వచ్చి వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ పవర్‌కు, బోయపాటి యాక్షన్ తోడైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద సునామీనే. అయితే, ఈ కాంబినేషనే సెట్ అవ్వాలి. ప్రస్తుతం పవన్ ఓ వైపు రాజకీయాలలో బిజీగా ఉంటునే కమిటయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెట్స్ మీద రెండు సినిమాలున్నాయి. మరో రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి బోయపాటి పవన్‌తో సినిమా చేయాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదని చెప్పుకుంటున్నారు. 

Updated Date - 2021-12-30T13:36:34+05:30 IST