ముంబై షెడ్యూల్‌లో సైఫ్ మాత్రమే..!

ABN , First Publish Date - 2021-06-13T19:44:31+05:30 IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. త్వరలో ముంబైలో మొదలవబోయే షెడ్యూల్‌లో కేవలం సైఫ్ అలీఖాన్ మాత్రమే పాల్గొనబోతున్నట్టు సమాచారం. ముంబై నుంచి హైదరబాద్‌లో చిత్రీకరణకు వచ్చిన ఆదిపురుష్ బృందంకి కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది.

ముంబై షెడ్యూల్‌లో సైఫ్ మాత్రమే..!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. త్వరలో ముంబైలో మొదలవబోయే షెడ్యూల్‌లో కేవలం సైఫ్ అలీఖాన్ మాత్రమే పాల్గొనబోతున్నట్టు సమాచారం. ముంబై నుంచి హైదరబాద్‌లో చిత్రీకరణకు వచ్చిన ఆదిపురుష్ బృందంకి కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. ఇక్కడ అనుకున్న షెడ్యూల్ జరగలేదు. కాగా మళ్ళీ ముంబైలోనే షెడ్యూల్ స్టార్ట్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ షెడ్యూల్‌లో ఎక్కువ సీన్స్ సైఫ్ అలీఖాన్‌వి ఉండటంతో, ఆయన మీదే షెడ్యూల్ మొత్తం  షూటింగ్ ప్లాన్ చేశారట. ఇందులో సైఫ్ రావణ్ పాత్రలో కనిపించనున్నాడు. సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్ పౌరాణిక పాత్ర, అది కూడా రాముడిగా నటిస్తున్న ఈ సినిమా మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 'సలార్' కూడా ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకొని త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. 

Updated Date - 2021-06-13T19:44:31+05:30 IST