నితిన్ - రష్మిక మరోసారి..?
ABN , First Publish Date - 2021-06-19T18:21:27+05:30 IST
యూత్‌స్టార్ నితిన్, రష్మిక మందన్న కలిసి మరోసారి స్క్రీన్ మీద సందడి చేయనున్నారా..అవుననే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో 'భీష్మ' వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి అభిమానులు ఈ జంటను మరోసారి స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నారు.

యూత్‌స్టార్ నితిన్, రష్మిక మందన్న కలిసి మరోసారి స్క్రీన్ మీద సందడి చేయనున్నారా..అవుననే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో 'భీష్మ' వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి అభిమానులు ఈ జంటను మరోసారి స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నారు. నితిన్ నటించిన 'రంగ్ దే'లో రష్మికనే హీరోయిన్‌గా నటిస్తుందని భావించారు. కానీ ఆ అవకాశం కీర్తి సురేష్‌కి దక్కింది. అయితే నితిన్ త్వరలో దర్శక, రచయిత వక్కంతం వంశీతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్నను హీరోయిన్‌గా నటింపచేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఈమె ప్రస్తుతం ఇటు తెలుగులో 'పుష్ప' అటు హిందీలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో నితిన్ సినిమాకి ఒకే చెప్తుందా అన్నది తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.