అన్న కోసం తారక్‌ వాయిస్‌!

ABN , First Publish Date - 2021-06-13T04:41:54+05:30 IST

జూనియర్‌ ఎన్టీఆర్‌ గొంతు ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన గొంతుతో ఎన్నో వేరియేషన్స్‌ పలికించే సామర్థ్యం ఉన్న హీరో ఆయన. ఎన్నో చిత్రాలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చి ఆయా సనివేశాలను రక్తి కట్టించారు. ఆయన నటించిన చాలా చిత్రాల్లో పాటలు పాడీ మెప్పించారు.

అన్న కోసం తారక్‌ వాయిస్‌!

జూనియర్‌ ఎన్టీఆర్‌ గొంతు ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన గొంతుతో ఎన్నో వేరియేషన్స్‌ పలికించే సామర్థ్యం ఉన్న హీరో ఆయన. ఎన్నో చిత్రాలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చి ఆయా సనివేశాలను రక్తి కట్టించారు. ఆయన నటించిన చాలా చిత్రాల్లో పాటలు పాడీ మెప్పించారు. తాజాగా ఓ వార్త డిజిటల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న ‘బింబిసార’ చిత్రానికి తారక్‌ వాయిస్‌ ఓవర్‌ అందించబోతున్నారని తెలిసింది. అయితే.. దీనికి సంబంధించి చిత్ర యూనిట్‌ చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కల్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రలో వశిష్ఠ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సమర్పణలో  కె.హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్‌, సంయుక్త మీనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. 




Updated Date - 2021-06-13T04:41:54+05:30 IST