నిధి బంపరాఫర్ కొట్టేసిందా?
ABN , First Publish Date - 2021-01-28T20:26:39+05:30 IST
`సవ్యసాచి` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది.

`సవ్యసాచి` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో తెలుగులో తొలి విజయం అందుకుని మరిన్ని అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా నిధి ఓ బంపరాఫర్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సరసన మెరిసే అవకాశం నిధి దక్కించుకుందట. పవన్ హీరోగా డైరెక్టర్ క్రిష్ ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నిధి ఎంపికైందట. బాలీవుడ్ ప్రముఖ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరో హీరోయిన్‌గా కనిపించనుందట. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.