Geetha Arts : ‘నాయాట్టు’ రీమేక్ ఆగిపోయిందా?
ABN , First Publish Date - 2021-12-14T19:27:24+05:30 IST
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రావు రమేశ్, ప్రియదర్శి, అంజలి ప్రధాన పాత్రల్లో ఈ మధ్యే ఒక సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయింది. మలయాళ సూపర్ హిట్ ‘నాయాట్టు’ మూవీకిది అఫీషియల్ రీమేక్. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. స్ర్కిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ను పోలీస్ డిపార్ట్ మెంటే వెంటాడే పరిస్థితులు తలెత్తుతాయి.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రావు రమేశ్, ప్రియదర్శి, అంజలి ప్రధాన పాత్రల్లో ఈ మధ్యే ఒక సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయింది. మలయాళ సూపర్ హిట్ ‘నాయాట్టు’ మూవీకిది అఫీషియల్ రీమేక్. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. స్ర్కిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ను పోలీస్ డిపార్ట్ మెంటే వెంటాడే పరిస్థితులు తలెత్తుతాయి. ఓ కేస్ విషయంలో ముగ్గురూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరికి వారి జీవితాలు ఏమవుతాయి? అనే కథాంశంతో ‘నాయాట్టు’ రూపొందింది. ఒరిజినల్ వెర్షన్ లో కుంచాక్కోబోబన్, జోజి జార్జ్, నిమిషా సజయన్ ముఖ్యపాత్రలు పోషించారు. మార్టిన్ ప్రకాట్ దీనికి దర్శకుడు.
ఇలాంటి అద్భుతమైన సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారనగానే.. ఈ సినిమా మీద అంచనాలు మొదలయ్యాయి. అయితే ఆఖరి నిమిషంలో మలయాళ నిర్మాతలకి, గీతా ఆర్ట్స్ వారికి రైట్స్ విషయంలో అభిప్రాయ బేధాలు తలెత్తాయట. అందుకే ఈ ప్రాజెక్ట్ ను గీతా ఆర్ట్స్ పక్కన పెట్టిందని, కరుణ కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని వేరే సినిమాను చేస్తున్నాడని టాక్. ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.