Akkineni Nagarjuna : మలయాళ రీమేక్‌పై మనుసుపడ్డారా?

ABN , First Publish Date - 2021-10-18T16:05:10+05:30 IST

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’, కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రాల్ని ఒకేసారి ట్రాక్ ఎక్కించారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపు కుంటున్నాయి. కాగా, తాజాగా నాగార్జున ఓ మలయాళ హిట్ మూవీపై మనసు పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ మూవీ చిత్రానికి మంచి అప్లాజ్ లభించింది.

Akkineni Nagarjuna : మలయాళ రీమేక్‌పై మనుసుపడ్డారా?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’, కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రాల్ని ఒకేసారి ట్రాక్ ఎక్కించారు.  ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపు కుంటున్నాయి. కాగా, తాజాగా నాగార్జున ఓ మలయాళ హిట్ మూవీపై మనసు పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ చిత్రానికి మంచి అప్లాజ్ లభించింది. నిమిషా సజయన్, సురాజ్ వెంజారమూడ్ జంటగా నటించిన ఈ సినిమా ఒక మధ్యతరగతి జీవితాన్ని కళ్ళకు కడుతుంది. కొత్తగా పెళ్ళయి అత్తింట్లోకి అడుగుపెట్టిన ఒక అమ్మాయికి అక్కడ ఎదురయ్యే కష్టాలు, వాటిని పరిష్కరించుకొనే క్రమంలో ఆమె తన ఆత్మాభిమానాన్ని తిరిగి ఎలా సంపాదించుకొంది అన్నదే ఈ సినిమా కథాంశం. 



ఈ సినిమా రీమేక్ రైట్స్ ను నాగార్జున తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమాకి నాగ్ నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఓ టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారని టాక్. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. అతి తక్కువ బడ్జెట్ తో రూపొంది.. మలయాళీల మనసు దోచిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ తెలుగు వెర్షన్ కూడా చిన్న బడ్జెట్ లోనే నిర్మించాలని నాగార్జున ఆలోచనగా తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.   

Updated Date - 2021-10-18T16:05:10+05:30 IST