సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతూ?

ABN, First Publish Date - 2021-12-30T19:08:07+05:30

అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ మూవీతో సాలిడ్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘థాంక్యూ’ లోనూ నటిస్తున్నారు. ఇందులో చైతు క్రికెటర్ గానూ, మహేశ్ బాబు వీరాభిమానిగానూ కనిపించబోతున్నాడు. అలాగే నాగచైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద కూడా డెబ్యూ ఇవ్వబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లో అతడు హీరోగా నటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ మూవీతో సాలిడ్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘థాంక్యూ’ లోనూ నటిస్తున్నాడు. ఇందులో చైతు క్రికెటర్ గానూ, మహేశ్ బాబు వీరాభిమానిగానూ కనిపించబోతున్నాడు. అలాగే నాగచైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద కూడా డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లో అతడు హీరోగా నటిస్తున్నాడు.  వీటితో పాటు చైతూ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అందింది. 


తాజా సమాచారం ప్రకారం ‘ఓ..బేబీ’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న నందినిరెడ్డి నాగచైతన్య హీరోగా ఒక కథ రెడీ చేసినట్టు, దానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్నదత్ నిర్మిస్తున్నారట. ఇక అల్లరి నరేశ్ తో నాంది సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అనౌన్స్ కానుంది.

Updated Date - 2021-12-30T19:08:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!