విజయ్ దేవరకొండ ప్లేస్ లో చైతూ.. ?

ABN , First Publish Date - 2021-09-20T14:09:36+05:30 IST

ఇటీవల నానీ తో ‘టక్ జగదీష్’ రూపొందించి.. ఓటీటీలో విడుదల చేసి మిశ్రమఫలితాన్ని అందుకున్నారు దర్శకుడు శివ నిర్వాణ.

విజయ్ దేవరకొండ ప్లేస్ లో చైతూ.. ?

ఇటీవల నానీ తో ‘టక్ జగదీష్’ రూపొందించి.. ఓటీటీలో విడుదల చేసి మిశ్రమఫలితాన్ని అందుకున్నారు దర్శకుడు శివ నిర్వాణ. ప్రస్తుతం శివ నిర్వాణ తదుపరి చిత్రం గురించి ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. నిజానికి శివ తన నెక్స్ట్ మూవీని విజయ దేవరకొండతో చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. విజయ్ ప్లేస్ లో నాగచైతన్య ని ఎంపిక చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ పై విజయ్ దేవరకొండకి ఇంట్రెస్ట్ లేదని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి చైతూ వచ్చిచేరారట.


ఇటీవల శివ నిర్వాణ నాగచైతన్య తో ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాడట. ఇంతకు ముందు శివ దర్శకత్వంలో ‘మజిలీ’ లాంటి సూపర్ హిట్ మూవీ చేసిన చైతూ.. శివ చెప్పిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీకి బాగా ఇంప్రెస్ అయ్యారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ప్రస్తుతం నాగచైతన్య .. శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదల హడావిడిలో ఉన్నారు. దీని తర్వాత విక్రమ్ కుమార్ ‘థాంక్యూ’ సినిమాపై ఫుల్ గా ఫోకస్ పెట్టనున్నారు. దాంతో పాటు తండ్రి నాగార్జున తో ‘బంగార్రాజు’ సినిమాలో కూడా నటించబోతున్నారు. ఆ తర్వాత ‘శివ నిర్వాణ’ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళతారట. మరి ఈ సారి శివతో చైతూ.. ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. 

Updated Date - 2021-09-20T14:09:36+05:30 IST