స్టార్ హీరోతో జోడీ కట్టనున్న వాణీ భోజన్

ABN , First Publish Date - 2021-02-21T23:42:24+05:30 IST

‘ఓ మై కడువులే’, ’లాకప్‌’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ వాణీ భోజన్‌కు మంచి అవ‌కాశం వ‌చ్చింది. ఈసారి స్టార్ హీరోతో జోడీ క‌ట్ట‌నుంది ఈ సొగ‌స‌రి. ఇంత‌కీ వాణీ భోజ‌న్ జోడీ క‌ట్ట‌బోతున్న ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. చియాన్ విక్ర‌మ్‌.

స్టార్ హీరోతో జోడీ కట్టనున్న వాణీ భోజన్

‘ఓ మై కడువులే’, ’లాకప్‌’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ వాణీ భోజన్‌కు మంచి అవ‌కాశం వ‌చ్చింది. ఈసారి స్టార్ హీరోతో జోడీ క‌ట్ట‌నుంది ఈ సొగ‌స‌రి. ఇంత‌కీ వాణీ భోజ‌న్ జోడీ క‌ట్ట‌బోతున్న ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. చియాన్ విక్ర‌మ్‌. ఇప్పుడు రాధామోహన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ, హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థపై తెరకెక్కించనున్న మరో చిత్రంలో నటించేందుకు వాణీ భోజన్‌ అగ్రిమెంట్‌ చేసుకుంది. ఈ నేపథ్యంలో చియాన్‌ విక్రమ్‌ సరసన నటించే అవకాశం రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఓకే చేసిందీ ముద్దుగుమ్మ. కార్తీక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ  చిత్రంలో విక్రమ్‌, ఆయన కుమారుడు ధృవ్‌ విక్రమ్‌ కలిసి నటించనున్నారు. ఇందులో విక్రమ్‌ సరసన నటించేందుకు వాణీ భోజన్‌ను ఎంపిక చేశారు. ధృవ్‌ విక్రమ్‌ కోసం కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మూవీ పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఇదిలావుంటే విక్రమ్‌ ప్రస్తుతం ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. 

Updated Date - 2021-02-21T23:42:24+05:30 IST