వెరైటీ టైటిల్‌తో మారుతి సినిమా..?

ABN , First Publish Date - 2021-06-17T14:00:54+05:30 IST

దర్శకుడు మారుతి 'ఏక్ మినీ కథ' హీరో సంతోష్ శోభన్‌తో ఓ చిన్న సినిమా చేస్తున్నాడు. దీనికి వెరైటీ టైటిల్‌ను అనుకుంటున్నట్టు వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సంతోష్ శోభన్ - మెహరీన్ జంటగా ఓటీటీ కోసం మారుతి ఓ సినిమా చేస్తుండగా, ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుందని సమాచారం.

వెరైటీ టైటిల్‌తో మారుతి సినిమా..?

దర్శకుడు మారుతి 'ఏక్ మినీ కథ' హీరో సంతోష్ శోభన్‌తో ఓ చిన్న సినిమా చేస్తున్నాడు. దీనికి వెరైటీ టైటిల్‌ను అనుకుంటున్నట్టు వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సంతోష్ శోభన్ - మెహరీన్ జంటగా ఓటీటీ కోసం మారుతి ఓ సినిమా చేస్తుండగా, ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి అయిపోయిందట. అయితే ఈ సినిమాకు 'మంచి రోజులు వచ్చాయి' అనే టైటిల్‌ను చిత్ర బృందం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ టైటిల్ చూస్తుంటే గత ఏడాది నుంచి కరోనా కారణంగా ఎదుర్కొంటున్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారనిపిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవి క్రియేషన్స్ నిర్మిస్తోంది. త్వరలో టైటిల్ ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక గోపీచంద్ - రాశిఖన్నా జంటగా 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందిస్తున్నాడు మారుతి. లాక్ డౌన్ వల్ల ఈ బ్రేక్ పడిన దీనిని త్వరలో సెట్స్ మీదకి తీసుకురానున్నారట. 

Updated Date - 2021-06-17T14:00:54+05:30 IST