త్రివిక్రమ్ సినిమాలో మహేశ్ రోల్ ఎలా ఉండబోతుందంటే..?
ABN, First Publish Date - 2021-05-04T16:02:52+05:30
సూపర్‌స్టార్ మహేశ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఓ సినిమాను నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో లేటెస్ట్‌గా మహేశ్ పాత్రకు సంబంధించిన వార్తొకటి చక్కర్లు కొడుతోంది.
సూపర్‌స్టార్ మహేశ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఓ సినిమాను నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అలాగే సినిమాకు సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. లేటెస్ట్‌గా మహేశ్ పాత్రకు సంబంధించిన వార్తొకటి చక్కర్లు కొడుతోంది. తన 28వ సినిమాలో మహేశ్ రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇప్పటికే డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తూనే ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా(మే 31) ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ తెలియజేసింది. అలాగే సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తామని కూడా నిర్మాత తెలిపారు. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన అతడు, ఖలేజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలను రాబట్టుకోలేకపోయాయి. అయితే మూడో సారి మహేశ్‌తో చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట.