'జాతిరత్నం'కి మహేష్ బాబు బంపర్ ఆఫర్..!
ABN , First Publish Date - 2021-03-19T21:19:04+05:30 IST
'జాతిరత్నం' సినిమాతో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన 'జాతిరత్నం' సినిమాలో
'జాతిరత్నం' సినిమాతో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన 'జాతిరత్నం' సినిమాలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమా నవీన్ పొలిశెట్టి స్టార్ తిరిగేలా చేసింది. ఎక్కడ చూసినా అందరు మాట్లాడుకుంటుంది ఈ యంగ్ హీరో గురించే. ఈక్రేజ్ వల్ల పలు బడా నిర్మాణ సంస్థలలో నటించే అవకాశం అందుకున్నాడు. ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌లో నవీన్ పొలిశెట్టి ఒక సినిమా చేస్తునట్టు సమాచారం. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు కూడా ఈ యంగ్ హీరోతో ఒక సినిమా చేయబోతున్నట్టు చెప్పుకుంటున్నారు.
దాదాపు ఈరెండు సినిమాలు కన్‌ఫర్మ్ అన్న మాట వినిపిస్తోంది. కాగా తాజాగా మరొక ప్రముఖ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైనమెంట్స్‌లో సినిమా చేసే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ బ్యానర్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ టాలెంట్‌తో సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే అడవి శేష్‌తో మేజర్ అన్న సినిమా నిర్మిస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తుండగా జూలై 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా మేజర్ తర్వాత మహేష్ బాబు నవీన్ పొలిశెట్టితో నెక్స్ట్ సినిమాని నిర్మించబోతున్నట్టు సమాచారం. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అన్న సినిమా చేతున్నాడు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థతో పాటు 14రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు.