మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్సయిందా?
ABN , First Publish Date - 2021-05-04T04:51:19+05:30 IST
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రీసెంట్‌గా ఓ ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రీసెంట్‌గా ఓ ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి. చిత్రయూనిట్ నుంచి ఈ టైటిల్‌పై ఎటువంటి ప్రకటన రాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ చిత్రానికి ‘పార్థు’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లుగా వార్తలు మొదలయ్యాయి. ‘పార్థు’.. ఇది ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. ఎక్కడో కాదు.. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’లో మహేష్ పేరు అదే. ఇప్పుడదే పేరుని ఈ సినిమా టైటిల్‌గా త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దాదాపు 11 ఏళ్లుకి మళ్లీ ఈ కాంబినేషన్‌లో మూవీ రాబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యే ఈ చిత్రం 2022 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటన రోజే తెలిపారు.