Mahesh babu: కాస్త ముందుగానే 'సర్కారు వారి పాట'కు..!
ABN , First Publish Date - 2021-12-30T17:23:08+05:30 IST
సూపర్ స్టార్ మహేష్ బాబు - కీర్తీ సురేష్ జంటగా పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న మోస్ట్ స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సర్కారు వారి పాట'. త్వరలో ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్‌లో మహేశ్ జాయిన్ కానున్నట్టు లేటెస్ట్ న్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు - కీర్తీ సురేష్ జంటగా పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న మోస్ట్ స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సర్కారు వారి పాట'. త్వరలో ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్‌లో మహేశ్ జాయిన్ కానున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చారు. మహేష్ కాలికి చిన్న సర్జరీ జరగడంతో దుబాయ్‌లో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఈ సర్జరీ తర్వాత మహేష్ షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు కాస్త ఎక్కువ సమయమే పడుతుందని వార్తలు వచ్చాయి. అయితే, త్వరగానే రికవర్ అవుతుండటంతో ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చెయ్యాల్సిన షూటింగ్ జనవరిలోనే మొదలవబోతుందట. ఈ షెడ్యూల్‌లో మహేష్ జాయిన్ కానున్నారని తెలుస్తుంది. దీనిపై త్వరలో కన్‌ఫర్మేషన్ రానుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా..జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జనవరి మొదటి వారంలో రానుంది.