సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'లూసిఫర్‌' రీమేక్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేసిన మెగాస్టార్‌

ABN, First Publish Date - 2021-01-03T18:13:11+05:30

మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ సినిమా సెట్స్ పై వెళ్లడానికి డేట్ ఫిక్స్ అయ్యింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య' సెట్స్‌పై ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోంది. కోకాపేటలోని 20 ఎకరాల స్థలంలో వేసిన టెంపుల్‌ సెట్‌లో చిరంజీవిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆచార్య తర్వాత మలయాళ చిత్రం 'లూసిఫర్‌' రీమేక్‌లో చిరంజీవి నటించనున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్న ఈ రీమేక్‌ షూటింగ్‌ను చిరంజీవి జనవరి 20న ప్రారంభించబోతున్నట్లు వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తెలుగు నెటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసిన డైరెక్టర్‌ మోహన్‌రాజా సినిమాకు 'బైరెడ్డి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. సత్యదేవ్‌ కీలక పాత్రలో నటించనున్నారు. 


Updated Date - 2021-01-03T18:13:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!