శ్రీదేవి చిన్న కూతురు కూడా వస్తోందా?
ABN , First Publish Date - 2021-02-02T16:00:57+05:30 IST
`ధడక్` సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసి ప్రేక్షకులను ఫిదా చేసింది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్.

`ధడక్` సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసి ప్రేక్షకులను ఫిదా చేసింది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ప్రస్తుతం జాన్వి బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయికగా కొనసాగుతోంది. త్వరలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా తెరంగేట్రం చేయబోతోందట. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆమెను వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాడట.
ఈ మేరకు ఇప్పటికే ఖుషీ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ను కరణ్ సంప్రదించాడట. ఖుషీ ప్రస్తుతం న్యూయార్క్‌లోని లీ స్టార్స్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందుతోంది. ఈ శిక్షణ ఈ ఏడాది చివర్లో పూర్తవుతుంది. ఆ తర్వాత ఖుషీ వెండితెర అరంగేట్రం చేయనుందట. వచ్చే ఏడాది ఆరంభంలో ఖుషీ ఎంట్రీ ఉంటుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.