సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

3డి ఫార్మాట్‌లో 'కేజీఎఫ్ 2' రిలీజ్ కానుందా..!

ABN, First Publish Date - 2021-12-17T17:36:26+05:30

3డి ఫార్మాట్‌లో 'కేజీఎఫ్ 2' రిలీజ్ కానుందా..! ప్రస్తుతం అవుననే టాక్ వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో 'కేజీఎఫ్ 2' కూడా ఒకటి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3డి ఫార్మాట్‌లో 'కేజీఎఫ్ 2' రిలీజ్ కానుందా..! ప్రస్తుతం అవుననే టాక్ వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో 'కేజీఎఫ్ 2' కూడా ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'కేజీఎఫ్ ఛాప్టర్ 1'కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారాణాల వల్ల ఆగిపోయింది. ఇక కొన్ని సీన్స్ మళ్ళీ రీషూట్ చేస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం 'ఆర్ఆర్ఆర్' మూవీ తరహాలోనే కేజీఎఫ్ 2ను కూడా 3డిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో. 

Updated Date - 2021-12-17T17:36:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!