‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ రిలీజ్‌పై లేటెస్ట్ అప్‌డేట్!.!
ABN , First Publish Date - 2021-06-23T19:33:40+05:30 IST
రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ . ఈ సినిమా రిలీజ్ డేట్‌పై త్వరలోనే నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం..

రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ . భారీ అంచనాలు నెలకొన్నఈ పాన్ ఇండియా సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ కి కొనసాగింపు అనే సంగతి తెలిసిందే. కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా రిలీజ్ డేట్‌పై త్వరలోనే నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. యశ్ డబ్బింగ్‌ను స్టార్ట్ చేశారు. జూలైలో ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తారట. ఇప్పటికే భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో సినిమాను అక్టోబర్ నెలలో లేదా డిసెంబర్‌లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’లో శ్రీనిధి శెట్టి హీరోయిన్. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా, రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.