‘తుపాకి’ సీక్వెల్ కమల్‌తోనా..?
ABN , First Publish Date - 2021-06-20T01:57:30+05:30 IST
విశ్వనటుడు కమల్‌హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహించే ‘ఇండియన్-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. అయితే, కరోనా లాక్‌డౌన్‌తో పాటు.. వివిధ కారణాల రీత్యా సినిమా
విశ్వనటుడు కమల్‌హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహించే ‘ఇండియన్-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. అయితే, కరోనా లాక్‌డౌన్‌తో పాటు.. వివిధ కారణాల రీత్యా సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే, యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ ఓ చిత్రంలో నటించనున్నారు. దీనికి ‘విక్రమ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ రెండు సినిమాలు కాకుండా.. కమల్ హాసన్‌ను ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మురుగదాస్ వినిపించిన కథ కమల్‌కు నచ్చడంతో ఆయన పచ్చజెండా ఊపినట్టు సమాచారం. వాస్తవానికి విజయ్ నటించిన ‘తుపాకి’ సీక్వెల్ కోసం మురుగదాస్ ఓ కథని సిద్ధం చేశారు. విజయ్ ప్రస్తుతం బిజీగా ఉండటంతో.. దానిని యథావిధిగా కమల్‌హాసన్‌కు సరిపోయేలా ఆయన మార్చినట్టు కోలీవుడ్‌లో కథనాలు వినవస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం మురుగదాస్ నుంచిగాని, కమల్ హాసన్ వైపు నుంచిగానీ రాలేదు.