అఖిల్ - సురేందర్ రెడ్డి మూవీలో ఉపేంద్ర..?
ABN , First Publish Date - 2021-06-04T19:54:59+05:30 IST
అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీగా ఉన్నట్టు సమాచారం.

అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీగా ఉన్నట్టు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన దీనికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు.
ఈ సినిమా పూర్తి చేసిన అఖిల్ సురేందర్ రెడ్డితో 'ఏజెంట్' కమిటయ్యాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే అఖిల్ లుక్ రిలీజై ఆకట్టుకుంది. ఇందులో ఓ ముఖ్య పాత్రకోసం ఉపేంద్రను సంప్రదించినట్టు తెలుస్తోంది. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో నటించిన ఈయన ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న 'గని'లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ సినిమాలో నటింపజేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది.