సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'కార్తికేయ' సీక్వెల్‌కి టైటిల్ ఇదేనా..?

ABN, First Publish Date - 2021-07-13T17:04:59+05:30

సూపర్ హిట్ మూవీ 'కార్తికేయ' సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం 'కార్తికేయ 2' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సీక్వెల్‌ చిత్రీకరణ జరుగుతుండగా, తాజాగా దీనికి 'దైవం మనుష్య రూపేణా' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్రం బృందం పరిశీలిస్తున్నట్టు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ హిట్ మూవీ 'కార్తికేయ' సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం 'కార్తికేయ 2' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సీక్వెల్‌ చిత్రీకరణ జరుగుతుండగా, తాజాగా దీనికి 'దైవం మనుష్య రూపేణా' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్రం బృందం పరిశీలిస్తున్నట్టు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఇంతకముందు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. కరోనా కారణంగా నిలిచిపోయిన చిత్ర షూటింగ్ ఆగస్టు నుండి యూరప్, వియత్నాంలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఈ క్రమంలో టైటిల్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్న చిత్ర బృందం 'దైవం మనుష్య రూపేణా' అనే టైటిల్ ఫిక్స్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. తాజా వార్తలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా, ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated Date - 2021-07-13T17:04:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!