సాయి పల్లవిలా .. తమన్నా ఆకట్టుకుంటుందా ..?

ABN , First Publish Date - 2021-03-20T17:48:19+05:30 IST

ఒక సూపర్ హిట్ అందుకుంటే అందరూ ఆ హీరోయిన్ గురించే మాట్లాడుకుంటారు. సినిమాలో ఆ హీరోయిన్ ఏ ఏ అంశాలలో బాగా ఆకట్టుకుంది..ఏ సీన్ బెస్ట్‌గా చేసింది.. ఏ డైలాగ్ బాగా చెప్పింది..ఇలా పలు విషయాల గురించి ఆసక్తికరంగా

సాయి పల్లవిలా .. తమన్నా ఆకట్టుకుంటుందా ..?

ఒక సూపర్ హిట్ అందుకుంటే అందరూ ఆ హీరోయిన్ గురించే మాట్లాడుకుంటారు. సినిమాలో ఆ హీరోయిన్ ఏ ఏ అంశాలలో బాగా ఆకట్టుకుంది..ఏ సీన్ బెస్ట్‌గా చేసింది.. ఏ డైలాగ్ బాగా చెప్పింది..ఇలా పలు విషయాల గురించి ఆసక్తికరంగా చర్చలు జరుపుతారు. ఇదే ఆ తర్వాత వరసగా అవకాశాలు వచ్చేలా చేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి చేరుకునేలా ప్లస్ అవుతుంది. అయితే ఏ సినిమాతో బాగా పాపులర్ అయిందో ఆ సినిమాని మిగతా హీరోయిన్స్ కూడా చూసి అలానే ఫాలో అవ్వాలని ట్రై చేస్తుంటారు. అయితే ఇది అందరికీ వర్కౌట్ అవడం కష్టం. కొంత మంది హీరోయిన్స్‌కి కొన్ని క్యారెక్టర్స్ గానీ కొన్ని మోడ్యులేషన్స్ గానీ బాగా సెట్ అవుతాయి. కొంతమందికి మాత్రం అస్సలు సూటవవు. చూసే వాళ్ళకి కూడా పంటికింద పడ్డ రాయిలా అనిపిస్తుంది. 


మరి తమన్నా ఈ విషయంలో సక్సస్ అవుతుందా.. తను చేస్తున్న ఈ ప్రయోగం పాపులారిటీని తీసుకు వస్తుందా.. లేక పంటికింద పడ్డ రాయిలా అనిపిస్తుందా చూడాలి. ఫిదా సినిమాలో సాయి పల్లవి మాదిరిగా తమన్నా కూడా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'సీటిమార్'. గోపీచంద్ హీరోగా నటించాడు. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా కోచ్‌లుగా కనిపించబోతున్నారు. తెలంగాణ జట్టు కోచ్‌గా నటించిన తమన్నా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం విశేషం. అయితే తమన్నా బాడీ లాంగ్వేజ్‌కి తెలంగాణ యాస సూటవుతుందా లేదా అన్నది సినిమా చూస్తేనే గాని చెప్పడం కష్టం. సాయి పల్లవికి సెట్ అయినట్టు తెలంగాణ యాస తమన్నాకి సెట్ అవుతుందా అన్న అనుమాలు కొంతమందిలో ఉన్నాయట. తమన్నాకి ప్రశంసలు వస్తాయా.. లేక నెగిటివ్ కామెంట్స్ వస్తాయా చూడాలి మరి. ఇక తమన్నా వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Updated Date - 2021-03-20T17:48:19+05:30 IST