సాయి పల్లవికి బాలీవుడ్ ఆఫర్..?
ABN , First Publish Date - 2021-06-17T13:14:15+05:30 IST
సాయి పల్లవికి ఓ హిందీ సినిమాలో నటించే క్రేజీ ఆఫర్ వచ్చిందని సోషల్ మీడియాలో వర్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో చాలా సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ కూడా గ్లామర్ బ్యూటీస్ పూజా హెగ్డే, రష్మిక మందన్నలతో పోటీ పడుతూ వారితో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుందనే మాట ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోంది.

సాయి పల్లవికి ఓ హిందీ సినిమాలో నటించే క్రేజీ ఆఫర్ వచ్చిందని సోషల్ మీడియాలో వర్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో చాలా సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ కూడా గ్లామర్ బ్యూటీస్ పూజా హెగ్డే, రష్మిక మందన్నలతో పోటీ పడుతూ వారితో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుందనే మాట ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోంది. గ్లామర్ రోల్స్, ఎక్స్‌ఫోజింగ్‌కి దూరంగా ఉంటూనే క్రేజీ హీరోయిన్‌గా వెలుగుతోంది. పూజా, రష్మికలకి ఈ మధ్య బాలీవుడ్‌లో మంచి ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో సాయి పల్లవికి బాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చిందట. దానికి సాయి పల్లవి కూడా ఒకే చెప్పిందని లేటెస్ట్ న్యూస్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సాయి పల్లవి స్వయంగా వెల్లడించాలి. ప్రస్తుతం ఈమె నటించిన 'లవ్ స్టోరి', 'విరాట పర్వం' విడుదకు సిద్దంగా ఉన్నాయి. నానితో నటిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే.