సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రిలీజ్ డేట్ ఫిక్స్..?

ABN, First Publish Date - 2021-05-04T14:48:01+05:30

పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సైనట్టు సోషల్ మీడియాలో తాజాగా వార్తలు వస్తున్నాయి. మలయాళ సూపర్ హిట్ సినిమా 'అయ్యప్పనుం కోషియం' తెలుగు రీమేక్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సైనట్టు సోషల్ మీడియాలో తాజాగా వార్తలు వస్తున్నాయి. మలయాళ సూపర్ హిట్ సినిమా 'అయ్యప్పనుం కోషియం' తెలుగు రీమేక్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ ఇప్పటికే సగం పూర్తయినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారట. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే మొదలు పెట్టి విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఐశ్వర్య రాజేష్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే నిత్యా మీనన్‌ని కూడా ఎంపిక చేశారని సమాచారం. కాగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా మ్యూజిక్ సెన్షేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' కూడా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ భారీ అంచనాలు ఏర్పరచింది. 2022 సంక్రాంతికి వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక హైరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమాలతో పాటు బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది.  

Updated Date - 2021-05-04T14:48:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!