సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మహేశ్ - త్రివిక్రమ్ మూవీ ఉందా..లేదా..?

ABN, First Publish Date - 2021-10-30T15:39:39+05:30

సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ మూవీ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ మూవీ ఉంటుందా ..లేదా అనే సందేహాలు మొదలయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ మూవీ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ మూవీ ఉంటుందా ..లేదా అనే సందేహాలు మొదలయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహేశ్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్. నవంబర్ మొదటి వారం నుంచి ఫైనల్ షెడ్యూల్ మొదలబోతోందని సమాచారం. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ నెక్స్ట్ మూవీ పట్టాలెక్కాలి. కానీ, తాజాగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే హింట్ ఇస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం 'పుష్ప' చేస్తున్న అల్లు అర్జున్.. నెక్స్ట్ సెట్స్‌పైకి వెళ్ళబోయోది త్రివిక్రమ్ మూవీనే అని టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో మహేశ్ - త్రివిక్రమ్ మూవీ ఉందా..లేదా అని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాట. మరి దీనిపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. 

Updated Date - 2021-10-30T15:39:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!