మహర్షి కాంబో మళ్ళీ రిపీట్..?

ABN , First Publish Date - 2021-04-08T20:55:42+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారట.

మహర్షి కాంబో మళ్ళీ రిపీట్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారట. దుబాయ్‌లో నెలరోజుల భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్ర బృందం సెకండ్ షెడ్యూల్ కూడా దుబాయ్‌లో ప్లాన్ చేశారట. అలాగే ఓ చిన్న షెడ్యూల్ గోవాలో అనుకున్నప్పటికి.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రెండు చోట్లా ప్లాన్ చేసిన షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసి 25 రోజుల పాటు హైదరాబాద్‌లో జరపనున్నట్టు సమాచారం. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు కూడా అధికారకంగా ప్రకటించారు.


అయితే ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడని కన్‌ఫర్మేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి చాలా సమయం పట్టేలా ఉండటంతో ఈ గ్యాప్‌లో మహేష్ బాబు మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా పూర్తి చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ - హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తారని సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించే అవకాశాలున్నాయట. మహేష్ బాబు - పూజా హెగ్డే కలిసి ఇంతక ముందు మహర్షి సినిమాలో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక మహేష్ - త్రివిక్రం సినిమాకి సంబధించిన అఫీషియల్ న్యూస్ మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రానుందని తెలుస్తోంది.

Updated Date - 2021-04-08T20:55:42+05:30 IST