'లవ్ స్టోరి' వాయిదా పడనుందా..?

ABN , First Publish Date - 2021-04-08T21:22:55+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాల రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందా అంటే అవునన్న మాటే వినిపిస్తోంది. ఇటీవల హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'సూరవన్షి' సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మేకర్సే అధికారకంగా వెల్లడించారు.

'లవ్ స్టోరి' వాయిదా పడనుందా..?

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాల రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందా అంటే అవునన్న మాటే వినిపిస్తోంది. ఇటీవల హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'సూరవన్షి' సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మేకర్సే అధికారకంగా వెల్లడించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద బాలీవుడ్ ప్రేక్షకుల్లో అలాగే ఇండస్ట్రీ వర్గాలలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మాత్రమే కాదు మరికొన్ని సినిమాలను రిలీజ్ చేసే ఉద్దేశంలో మేకర్స్ లేరని ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా పెద్ద సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలను రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నట్టు ఆయా చిత్రాల మేకర్స్ అభిప్రాయపడుతున్నారట.


ఈ క్రమంలోనే 'లవ్ స్టోరి' సినిమా కూడా పోస్ట్ పోన్ చేస్తారన్న మాట వినిపిస్తోంది. అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఇప్పటికే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 16న రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు థియేటర్స్‌కి వస్తారన్నది అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 'లవ్ స్టోరి' చిత్ర బృందం బయ్యర్లతో చర్చలు జరపగా సగం మంది విడుదల చేసేయమని, సగం మంది పోస్ట్ పోన్ చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. పోస్ట్ పోన్ చేయడమే మంచిదన్న అభిప్రాయంలో దర్శకుడు, హీరో కూడా ఉన్నారట. అందుకే లవ్ స్టోరి పోస్ట్ పోన్ చేసందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకా ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది.

Updated Date - 2021-04-08T21:22:55+05:30 IST