కాజల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..?

ABN , First Publish Date - 2021-11-16T15:22:39+05:30 IST

కాజల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..? ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని కాజల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత కూడా సినిమాలకు సైన్ చేసిన

కాజల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..?

కాజల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..? ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని కాజల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత కూడా సినిమాలకు సైన్ చేసిన ఆమె, ఇటీవల కమిటయిన సినిమాలను వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కాజల్ ప్రెగ్నెంట్ అట. ఇదిలా ఉంటే ఇంతలోనే కాజల్.. తన భర్తను సినిమాలలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ తమ బిజినెస్ కోసం ఒక వీడియో షూట్‌లో పాల్గొన్నారు. దీనిని బట్టి చూస్తే గౌతమ్ కిచ్లూకి కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అర్థమవుతోంది. అందుకే కాజల్.. తన భర్త కోసం దర్శక, నిర్మాతలకు ఓ అవకాశం కల్పించమని కోరుతున్నట్టు సమాచారం.  

Updated Date - 2021-11-16T15:22:39+05:30 IST