చరణ్ యంగ్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపుతున్నాడా..?

ABN , First Publish Date - 2021-11-09T19:13:34+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపుతున్నాడనే వార్తలు ఇప్పుడు జోరందుకున్నాయి. పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ పూర్తి కాగానే శంకర్‌తో మరో పాన్ ఇండియన్ సినిమాను

చరణ్ యంగ్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపుతున్నాడా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపుతున్నాడనే వార్తలు ఇప్పుడు జోరందుకున్నాయి. పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ పూర్తి కాగానే శంకర్‌తో మరో పాన్ ఇండియన్ సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభించి భారీ వ్యయంతో కూడుకున్న ట్రైన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ సినిమాలో 7 నిమిషాలకి పైగా ఉంటుందట. అంతేకాదు ఆర్సీ 15 చిత్రానికే ఈ ఎపిసోడ్ హైలెట్‌గా నిలవనుందని చెప్పుకుంటున్నారు.


అయితే, ఇంతలోనే మరో న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. శంకర్ దర్శకత్వంలో ఇది వరుకే మొదలై ఆగిపోయిన 'ఇండియన్ 2' మళ్ళీ డిసెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 100 రోజుల చిత్రీకరణ మిగిలి ఉండగా ఏకాధాటిగా షూటింగ్ జరిపి షూటింగ్‌ను పూర్తి చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ నేపథ్యంలో మూడు నుంచి నాలుగు నెలలు ఆర్సీ 15కు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే చరణ్ ఇటీవల తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన గౌతమ్ తిన్ననూరిని రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. త్వరలో దీనిపై మరింత స్పష్ఠత రానుందట. 

Updated Date - 2021-11-09T19:13:34+05:30 IST