మైత్రీ మూవీస్‌లో అఖిల్ చిత్రం..?
ABN , First Publish Date - 2021-06-13T15:57:00+05:30 IST
అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌లో అక్కినేని అఖిల్ ఓ చిత్రం చేయబోతున్నాడనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో టాలీవుడ్ స్టార్స్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న మైత్రీ వారు నాని లాంటి యంగ్ హీరోలతోనూ మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నారు.

అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌లో అక్కినేని అఖిల్ ఓ చిత్రం చేయబోతున్నాడనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో టాలీవుడ్ స్టార్స్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న మైత్రీ వారు నాని లాంటి యంగ్ హీరోలతోనూ మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా ఓ లవ్‌స్టోరి నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడికాకున్నాయని తెలుస్తోంది. అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బాచ్‌లర్' రిలీజ్ కావాల్సి ఉంది. ఇక స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేయనున్నాడు అఖిల్. దీని తర్వాత మైత్రీ నిర్మాణంలో సినిమా ఉండే అవకాశాలున్నాయి.