మెగాస్టార్, రష్మికల సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్..!
ABN , First Publish Date - 2021-03-20T16:53:12+05:30 IST
కొన్ని కాంబినేషన్స్‌లో సినిమా అనగానే అందరూ ముందుగా కథ ఎలాంటిది అన్న ఆసక్తితో చర్చలు జరుపుతుంటారు. ఆ తర్వాత టైటిల్ గురించి టాపిక్ వస్తుంది. ఎందుకంటే కథ చెప్పే ఛాన్స్ ఉండదు కాబట్టి టైటిల్‌తో అయినా కొంత వరకు
కొన్ని కాంబినేషన్స్‌లో సినిమా అనగానే అందరూ ముందుగా కథ ఎలాంటిది అన్న ఆసక్తితో చర్చలు జరుపుతుంటారు. ఆ తర్వాత టైటిల్ గురించి టాపిక్ వస్తుంది. ఎందుకంటే కథ చెప్పే ఛాన్స్ ఉండదు కాబట్టి టైటిల్‌తో అయినా కొంత వరకు ఆ సినిమా కథా నేపథ్యం ఏంటన్న హింటో లేక క్లారిటీనో దొరుకుందన్న ఆలోచన. ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి 'ఛలో' సినిమాతో పరిచయం అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. అంతేకాదు స్టార్ స్టేటస్‌ని అందుకొని వరసగా భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. ఇప్పటికే సిద్దార్థ్ మల్‌హోత్రాతో కలిసి 'మిషన్ మజ్ఞు' అన్న సినిమాలో రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా త్వరలో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కిలిసి రష్మిక మందన్న మరొక సినిమా చేస్తోంది. తండ్రి - కూతురు మధ్యన సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాని విక్రం భల్ తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమాకి ముందు 'డెడ్లీ' అన్న టైటిల్‌ని పెట్టబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ 'గుడ్ బాయ్' అంటూ ప్రచారం మొదలైంది. మరి ఈ రెండు టైటిల్స్‌లో మేకర్స్ ఫైనల్‌గా ఏ టైటిల్‌ని ఫిక్స్ చేస్తారన్నది ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. కాగా తెలుగులో సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్పలో నటిస్తోంది రష్మిక. అలాగే తమిళంలో కార్తి సరసన సుల్తాన్ కూడా రష్మిక చేతిలో ఉంది.