ఫిబ్రవరి నుంచి ‘ఇండియన్‌-2’ చిత్రీకరణ

ABN , First Publish Date - 2021-01-18T18:03:06+05:30 IST

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌-2’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఫిబ్రవరి నుంచి ‘ఇండియన్‌-2’ చిత్రీకరణ

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌-2’. ఈ చిత్రం గతంలో వచ్చిన ‘ఇండియన్‌’ సినిమాకు సీక్వెల్‌. లైకా ప్రొడక్షన్‌ నిర్మాణ సంస్థ అధిపతి సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, సిద్ధార్థ్‌ తదితరులు నటిస్తున్నారు. అయితే, గత యేడాది ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో క్రేన్‌ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత షూటింగ్‌ ఆగిపోయింది. ఇంతలో యువదర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ తెరకెక్కించనున్న చిత్రంలో నటించేందుకు కమల్‌హాసన్‌ అంగీకరించారు. అదేసమయంలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత తన కొత్త చిత్రం షూటింగులో కమల్‌ పాల్గొంటారని సమాచా రం. దీంతో ‘ఇండియన్‌-2’ షూటింగ్‌ ఎపుడు ప్రారంభమవుతుందో నన్న అనుమానం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో దర్శకుడు శంకర్‌ నిర్మాణ సంస్థకు ఓ లేఖ రాస్తూ... ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొన్నట్టు వార్త లు గుప్పుమన్నాయి. వీటిని నిర్మాణ సంస్థ తోసి పుచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి ప్రారం భించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా తొలుత హీరోయిన్లు, ఇతర నటీనటులపై సన్నివేశాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమల్‌ హాసన్‌ రెగ్యులర్‌ షెడ్యూల్‌లో పాల్గొని తన పార్టు షూటింగును పూర్తి చేసేలా సన్నాహాలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే దర్శకుడు శంకర్‌ లేదా నిర్మాణ సంస్థ నుంచి క్లారిటీ రావాల్సి వుంది.

Updated Date - 2021-01-18T18:03:06+05:30 IST