సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'మాస్ట్రో' ముందు థియేటర్స్‌లోనేనా..?

ABN, First Publish Date - 2021-07-11T18:35:17+05:30

యూత్ స్టార్ నితిన్ నటించిన మాస్ట్రో మూవీ ముందు థియేటర్స్‌లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూత్ స్టార్ నితిన్ నటించిన మాస్ట్రో మూవీ ముందు థియేటర్స్‌లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సూపర్ హిట్ 'అంధాదున్‌'కి అఫీషియల్ రీమేక్‌గా యంగ్ డైరెక్టర్ మేరపాక గాంధీ తెరకెక్కించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్స్ వర్క్ జరుగుతోంది. త్వరలో మ్యూజిక్ ఫెస్ట్ కూడా చిత్ర బృందం మొదలు పెట్టనుంది. అయితే, ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ఆఫర్ ఇచ్చి ఓటీటీ రిలీజ్‌కి ఒప్పందం కుదుర్చుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మేకర్స్ ప్లాన్ మార్చుకొని ముందు థియేటర్స్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 


వెంకటేశ్ - ప్రియమణి నటించిన 'నారప్ప' కూడా ముందు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒప్పందం కుదురింది. అయితే థియేటర్స్ ఓపెన్ కాబోతుండటంతో మేకర్స్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొని థియేటర్స్ రిలీజ్‌కి రెడీ అవుతున్నట్టు సమాచారం. నితిన్ మాస్ట్రో కూడా ముందు థియేటర్స్‌లో రిలీజ్ చేశాకే, ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే ఇందులో వాస్తవం ఏంటనేది తెలియాలంటే మేకర్స్ స్పందిచే వరకు ఆగాల్సిందే.  

Updated Date - 2021-07-11T18:35:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!