కుమారి కష్టాలు తీర్చేదెవరు..?
ABN , First Publish Date - 2021-11-28T15:05:58+05:30 IST
'కుమారి 21ఎఫ్' మూవీతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో కుర్ర హీరోలకు మంచి ఛాయిస్..కొన్నేళ్ళు ఇండస్ట్రీలో బాగా వెలుగుతుందని అందరూ అనుకున్నారు.
'కుమారి 21ఎఫ్' మూవీతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో కుర్ర హీరోలకు మంచి ఛాయిస్..కొన్నేళ్ళు ఇండస్ట్రీలో బాగా వెలుగుతుందని అందరూ అనుకున్నారు. అందరు అనుకున్నట్టుగానే వరుసగా అవకాశాలు కూడా వచ్చిపడ్డాయి. కానీ, 'కుమారి 21ఎఫ్' లాంటి సాలీడ్ హిట్ మాత్రం దక్కలేదు. చక చకా నాలుగు సినిమాలైతే చేసింది గానీ..అవి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఆఖరికి '24 కిసెస్' అంటూ ముద్దులతో రెచ్చిపోయింది కూడా. కానీ, ఆ సినిమా తర్వాత అమ్మడి ఊపు మరీ తగ్గిపోయింది. దాంతో ఐటెం బాంబ్‌లాగా కూడా ఎగిరిపడింది. రామ్ పోతినేని డ్యూయల్ రోల్‌లో నటించిన 'రెడ్' సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో మెరిసింది హెబ్బా పటేల్. ఇది కూడా పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం సినిమాల కోసం ఎదురుచూపులు అన్నట్టుగా ఉంది తన పరిస్థితి. టాలెంట్ పరంగా హెబ్బాను కామెంట్ చేయడానికి లేదు. అయితే, సరైన హిట్టే పడడం లేదు. మళ్ళీ 'కుమారి 21ఎఫ్' లాంటి సాలీడ్ హిట్ పడితే లైన్‌లోకి వచ్చేస్తుంది. మరి అలాంటి అవకాశం ఇవ్వాలంటే సుకుమార్ లాంటివారే ఆలోచించాలి. అప్పుడు గానీ హెబ్బా కష్టాలు తీరవు.