సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శరవేగంగా 'శాకుంతలం'

ABN, First Publish Date - 2021-07-15T14:41:43+05:30

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని నటిస్తున్న శాకుంతలం మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతుందని సమాచారం. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల-దుష్యంత మహారాజు ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని నటిస్తున్న శాకుంతలం మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతుందని సమాచారం. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల-దుష్యంత మహారాజు ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. కరోనా కారణంగా బ్రేక్ పడిన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. అంతేకాదు సెప్టెంబర్ వరకు షూటింగ్‌ మొత్తం పూర్తికానున్నట్టు తెలుస్తోంది. 'జాను' ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సమంత ఇటీవల 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'తో వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత పాన్ ఇండియన్ సినిమా 'శాకుంతలం'తో రావడానికి సిద్దమవుతోంది.

Updated Date - 2021-07-15T14:41:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!