టాలీవుడ్‌కి రియా నిరభ్యంతరంగా రావచ్చు
ABN, First Publish Date - 2021-05-04T05:26:43+05:30
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు కూడా వెళ్లివచ్చిన నటి రియా చక్రవర్తి చూపు ఇప్పుడు సౌత్‌పై ఉందా అంటే.. అవునని చెప్పకతప్పదు. ఎందుకంటే.. ఇప్పుడామెను బాలీవుడ్‌లో ఆదరించేవారెవరూ లేరు. అంతకుముందు ఆమెకు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు కూడా వెళ్లివచ్చిన నటి రియా చక్రవర్తి చూపు ఇప్పుడు సౌత్‌పై ఉందా అంటే.. అవునని చెప్పకతప్పదు. ఎందుకంటే.. ఇప్పుడామెను బాలీవుడ్‌లో ఆదరించేవారెవరూ లేరు. అంతకుముందు ఆమెకు అవకాశాలు ఇస్తామని సానుభూతి చూపించిన వారు కూడా ముఖం చాటేస్తుండటంతో.. ఆమె సినీ కెరియర్ బాలీవుడ్‌లో ముగిసిపోయేనట్లే అనేలా టాక్ మొదలైంది. అందుకే రియా చక్రవర్తి ఇప్పుడు సౌత్‌వైపు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఇక ఆమెను సౌత్‌కి ముఖ్యంగా టాలీవుడ్‌కి ఆహ్వానించడానికి టాలీవుడ్‌కి చెందిన కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ మధ్య వార్తలు కూడా వచ్చాయి.
నిర్మాతలే కాదు హీరోలు కూడా.. ఆమెకు అభయహస్తం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. బాలీవుడ్‌లోలా టాలీవుడ్‌లో ఉండదని.. అందం, టాలెంట్ ఉంటే చాలు.. ఇక్కడ మంచి మంచి అవకాశాలు వస్తాయని ఆమెకు చెబుతున్నారట. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలా కోట్లకి కోట్లు డిమాండ్ చేయకుండా ఉంటే ఇక్కడ కొంతకాలం తనకి తిరుగుండదని కూడా రియాకు ఇక్కడి హీరోలు సలహాలు ఇస్తున్నారనే వార్తలు వినవస్తున్నాయి. ఇక రియా విషయానికి వస్తే.. టాలీవుడ్ నుంచే ఆమె నటిగా పరిచయం అయింది. తూనీగ తూనీగ చిత్రంతో ఆమె నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.