‘గాడ్ ఫాదర్’: మెగాస్టార్‌కి ఫాదర్‌గా విజయ్ చందర్..?

ABN , First Publish Date - 2021-10-18T15:51:42+05:30 IST

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. మలయాళ హిట్ మూవీ లూసీఫర్‌కి రీమేక్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో కొన్ని కీలకమైన పాత్రలు ఉన్నాయి.

‘గాడ్ ఫాదర్’: మెగాస్టార్‌కి ఫాదర్‌గా విజయ్ చందర్..?

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. మలయాళ హిట్ మూవీ లూసీఫర్‌కి రీమేక్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో కొన్ని కీలకమైన పాత్రలు ఉన్నాయి. వీటిలో ఓ పాత్రను సీనియర్ నటుడు విజయ్ చందర్ చేయబోతున్నారట.‘గాడ్ ఫాదర్’ సినిమాలో మెగాస్టార్‌కి ఫాదర్‌గా  విజయ్ చందర్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం పాత్రలో విజయ్ చందర్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక సీనియర్ హీరోయిన్ కుష్బూ కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. తమన్‌ సంగీత దర్శకుడు. 

Updated Date - 2021-10-18T15:51:42+05:30 IST