నాని..ఐదుగురు హీరోయిన్స్!
ABN , First Publish Date - 2021-06-17T01:11:39+05:30 IST
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగానే కాదు.. నిర్మాతగానూ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా నాని నిర్మాతగా ..

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగానే కాదు.. నిర్మాతగానూ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా నాని నిర్మాతగా తన బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమాపై నాలుగో సినిమాగా ‘మీట్ క్యూట్’ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో నాని సోదరి దీప్తి ఘంటా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ఇందులో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారట. అందులో ముగ్గురు స్టార్ హీరోయిన్స్, ఇద్దరు కొత్త హీరోయిన్స్‌ను తీసుకుంటారట. ఆ హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని నాని ఒక్కొక్కరిగా రివీల్ చేస్తూ వస్తారట. ఈ చిత్రాన్ని ముప్పై రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశారని సమాచారం.