'లెజెండరీ' బయోపిక్ '83' కోసం వెయిటింగ్..!

ABN , First Publish Date - 2021-06-23T17:04:49+05:30 IST

'లెజెండరీ' క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం '83'. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ఏడాదే విడుదల చేయనున్నామంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని ప్రచారం జరిగింది.

'లెజెండరీ' బయోపిక్ '83' కోసం వెయిటింగ్..!

'లెజెండరీ' క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం '83'. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ఏడాదే విడుదల చేయనున్నామంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా దీనీ ఊసే ఎక్కడా వినిపించడం లేదు. ఫస్ట్ లాక్ డౌన్ అయిపోయింది. ఆ తర్వాత రిలీజ్ అని వార్తలు వచ్చాయి. ఇటీవల సెకండ్ లాక్ డౌన్ కూడా ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న '83' ని ఎప్పుడు విడుదల చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి మేకర్స్ ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చుడాలి. రన్వీర్ సింగ్ టైటిల్ పాత్రలో నటించాడు. కబీర్ ఖాన్ ఈ సినిమాను తెరకెక్కించగా, భారీ బడ్జెట్‌తో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోన్నఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున రిలీజ్ చేయనున్నారు. 

Updated Date - 2021-06-23T17:04:49+05:30 IST