ధనుష్‌ సరసన మరోసారి జోడీగా..

ABN , First Publish Date - 2021-01-18T18:35:52+05:30 IST

హీరో ధనుష్‌, దర్శకుడు సెల్వరాఘవన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘నానే వరువేన్‌’ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

ధనుష్‌ సరసన మరోసారి జోడీగా..

హీరో  ధనుష్‌, దర్శకుడు సెల్వరాఘవన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘నానే వరువేన్‌’ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రానికి ఇప్పుడు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇందులో భాగంగా తొలుత హీరోయిన్‌ కోసం పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ లిస్టులో తమన్నా పేరు తెరపైకి వచ్చింది. ఈ చిత్ర కథకు అనుగుణంగా తమన్నాను తీసుకోవాలన్న ఆలోచనలో దర్శకుడు సెల్వరాఘవన్‌ కూడా వున్నట్టు సమాచారం. అలాగే దనుష్‌ సైతం తమన్నాకు ఓకే చెప్పినట్టు వినికిడి. తమన్నా కూడా సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే, దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చుతుండగా, అరవింద్‌ కృష్ణన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. గతంలో ధనుష్‌తో కలిసి తమన్నా ‘పడిక్కాదవన్‌’, ‘వేంగై' అనే చిత్రాల్లో నటించింది. 


Updated Date - 2021-01-18T18:35:52+05:30 IST