మెగా156 కి దర్శకుడు ఇతడేనా?

ABN , First Publish Date - 2021-12-14T20:48:34+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ‘ఆచార్య’ సినిమా విడుదలకు రెడీ అవుతుండగా.. రెండేళ్ళ వరకూ గ్యాప్ తీసుకోలేని విధంగా సినిమాల మీద సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. అలాగే... కొత్త సినిమాల్ని కూడా చక చక అనౌన్స్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు 156వ చిత్రానికి కూడా సమయం ఆసన్నమైనట్టు కనిపిస్తోంది.

మెగా156 కి దర్శకుడు ఇతడేనా?

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ తో దూసుకుపోతున్నారు.  ‘ఆచార్య’ సినిమా విడుదలకు రెడీ అవుతుండగా.. రెండేళ్ళ వరకూ గ్యాప్ తీసుకోలేని విధంగా సినిమాల మీద సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. అలాగే... కొత్త సినిమాల్ని కూడా చక చక అనౌన్స్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు 156వ చిత్రానికి కూడా సమయం ఆసన్నమైనట్టు కనిపిస్తోంది. డివీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుండగా.. ‘ఛలో, భీష్మ’ చిత్రాలతో ప్రేక్షకులకి వినోదాన్ని పంచిన వెంకీ కుడుముల దర్శకత్వంలోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. తనకి బాగా ఇష్టమైన , తాను బాగా డీల్ చేయగలిగిన కామెడీ జోనర్ లోనే సినిమా తెరకెక్కబోతుండడం విశేషం. 


వెంకీ చెప్పిన సూపర్ కామెడీ స్ర్కిప్ట్ కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అతి త్వరలో ఈ సినిమా అనౌన్స్ కాబోతోంది. ‘భీష్మ’ చిత్రం తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని గట్టి ప్రయత్నం చేసిన వెంకీకి ఏకంగా మెగాస్టార్ నుంచే ఆఫర్ రావడం గ్రేటే. ఈ సినిమాకి సంబంధించిన కేస్ట్ అండ్ క్రూ వివరాలు సినిమా ప్రకటన రోజునే తెలుపబోతున్నారు. 

Updated Date - 2021-12-14T20:48:34+05:30 IST