స్పోర్ట్స్‌ పీరియాడిక్‌ డ్రామాగా బుచ్చిబాబు నెక్ట్స్ సినిమా..?

ABN , First Publish Date - 2021-02-17T16:58:36+05:30 IST

బుచ్చిబాబు ఇప్పుడు చేయబోతున్న మూవీ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని సమాచారం.

స్పోర్ట్స్‌ పీరియాడిక్‌ డ్రామాగా బుచ్చిబాబు నెక్ట్స్ సినిమా..?

డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ప్రేమకథా చిత్రం 'ఉప్పెన'. సాయితేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా, శాండిల్‌వుడ్‌ సొగసరి కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. సినిమా విడుదలకు ముందే ఉప్పెనకు మంచి క్రేజ్‌ వచ్చింది. అప్పుడే చాలా మంది నిర్మాతలు బుచ్చిబాబు సానాతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపారు. ఇక 'ఉప్పెన' విడుదల తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో బుచ్చిబాబు సానాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు చాలా మంది మరింత ఆసక్తిని కనపరుస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు బుచ్చిబాబు సానా తన తదుపరి చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లోనే చేయబోతున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే.. బుచ్చిబాబు ఇప్పుడు చేయబోతున్న మూవీ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని సమాచారం.  


'ఉప్పెన' సినిమాను గోదావరి జిల్లాల నేపథ్యంలో తెరకెక్కించిన బుచ్చిబాబు సానా, తర్వాత తెరకెక్కించబోయే స్పోర్ట్స్‌ డ్రామాను 1980 గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ అగ్ర హీరోతో ఈ సినిమాను రూపొందించడానికి చర్చలు జరుపుతుంది. తర్వలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ క్లారిటీ వస్తుందని వార్తలు సినీ వర్గాల్లో న్యూస్‌ హల్‌చల్‌ చేస్తుంది. 

Updated Date - 2021-02-17T16:58:36+05:30 IST