దగ్గుబాటి రానా కారు డ్రైవర్‌గా ఆ నటుడు
ABN , First Publish Date - 2021-05-04T00:36:25+05:30 IST
దగ్గుబాటి రానా కారు డ్రైవర్ అంటూ సోషల్ మీడియాలో ఓ నటుడి పేరు రెండు రోజులుగా వైరల్ అవుతుంది. ఎవరా నటుడు? ఏంటా కథ అనేది తెలుసుకోవాలంటే.. పూర్తి స్టోరీ చదవాల్సిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో
దగ్గుబాటి రానా కారు డ్రైవర్ అంటూ సోషల్ మీడియాలో ఓ నటుడి పేరు రెండు రోజులుగా వైరల్ అవుతుంది. ఎవరా నటుడు? ఏంటా కథ అనేది తెలుసుకోవాలంటే.. పూర్తి స్టోరీ చదవాల్సిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో మలయాళం చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రం రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో (సినిమాలో బిజు మీనన్ పాత్ర) కనిపించనుండగా.. రానా జవాన్ పాత్రను(పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర) చేస్తున్నారు. 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ డ్రైవర్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. డ్రైవర్ ఎప్పుడూ అతని పక్కనే ఉంటాడు. ఆ పాత్రను ప్రస్తుత రీమేక్‌లో ఎవరు చేస్తున్నారనే దానిపై సోషల్ మీడియా ఓ నటుడిని ఫిక్స్ చేసేసింది.
ఈ పాత్రపై చిత్రయూనిట్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు కానీ.. నటుడు బ్రహ్మాజీ ఈ పాత్రను చేస్తున్నట్లుగా.. సోషల్ మీడియా రివీల్ చేసేసింది. రెండు రోజులుగా రానా డ్రైవర్ పాత్రలో బ్రహ్మాజీ అంటూ వార్తలు మొదలయ్యాయి. బ్రహ్మాజీ కానీ, చిత్రయూనిట్ కానీ ఖండించకపోవడంతో.. ఈ వార్త నిజమే అనేలా టాలీవుడ్‌లో కూడా టాక్ మొదలైంది. దీనిపై చిత్రయూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మిస్సైల్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. 50 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది.
