'లూసిఫర్‌'లో భారీ మార్పు?

ABN , First Publish Date - 2021-01-18T14:38:40+05:30 IST

మలయాళ చిత్రం 'లూసిఫర్‌' రీమేక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది.

'లూసిఫర్‌'లో భారీ మార్పు?

మలయాళ చిత్రం 'లూసిఫర్‌' రీమేక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా విషయంలో చాలా వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మలయాళ 'లూసిఫర్‌'ను పృథ్వీరాజ్‌ డైరెక్ట్‌ చేయడమే కాకుండా సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. తెలుగులో ఆ పాత్రను ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ లేటెస్ట్‌ సమాచారం మేరకు తెలుగు రీమేక్‌లో ఆ పాత్ర ఉండదట. ఈ చిత్రానికి తెలుగులో బైరెడ్డి అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 


Updated Date - 2021-01-18T14:38:40+05:30 IST