'భీమ్లా నాయక్': ఒరిజినల్ వెర్షన్‌లో కూడా లేని విధంగా..!

ABN , First Publish Date - 2021-11-09T13:33:59+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ 'భీమ్లా నాయక్'. ఒరిజినల్ వెర్షన్‌లో కూడా లేని విధంగా ఇందులో కొన్ని అంశాలు ఉండబోతున్నాయట.

'భీమ్లా నాయక్': ఒరిజినల్ వెర్షన్‌లో కూడా లేని విధంగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ 'భీమ్లా నాయక్'. ఒరిజినల్ వెర్షన్‌లో కూడా లేని విధంగా ఇందులో కొన్ని అంశాలు ఉండబోతున్నాయట. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్స్‌కు భారీగా రెస్పాన్స్ వచ్చింది.కాగా, తాజా సమాచారం ప్రకారం 'భీమ్లా నాయక్' చిత్రంలో మొత్తం 7 పాటలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఒక్కొక్కటిగా మిగతా పాటలను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఒరిజినల్ వెర్షన్‌లో కూడా ఇన్ని పాటలు ఉండవు. అందుకే ఇప్పుడు 'భీమ్లా నాయక్'పై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లేతో పాటుగా ఓ పాట కూడా అందించారు. 2022, సంక్రాంతి బరిలో దిగబోతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 


Updated Date - 2021-11-09T13:33:59+05:30 IST